ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సత్తాచాటింది. సెప్టెంబర్ త్రైమాసికానికి సంస్థ రూ.2,773 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,929 కోట్ల లాభంతో పోలిస్తే 44 శాతం వృద్ధిని కనబరిచింది. కంపెనీ ఆదాయం కూడా రూ.21,470 కోట్ల నుంచి రూ.29,870 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. ఒక త్రైమాసికంలో ఇంతటి ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.