నేడు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. బలమైన, అవినీతి రహిత ప్రభుత్వమే దేవభూమి ప్రజల అభివృద్ధి కలలను నెరవేర్చగలదని, హిమాచల్ ప్రజలకు ముఖ్యంగా మహిళలు, యువత అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొని రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నట్లు అమిత్ షా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.