ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరం నుండి బలగాలను ఉపసంహరించుకున్నట్లు మాస్కో శుక్రవారం తెలిపింది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు, సిబ్బందితో పాటు ఆయుధ సామాగ్రిని నిప్రో నది తూర్పు తీరంవైపు తరలించినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. దీంతో నగర వ్యాప్తంగా ప్రజలు సందడి చేస్తున్నారు. ఉక్రెయిన్ జెండాలతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ పరిణామాన్ని ఉక్రెయిన్ కీలక విజయంగా ప్రకటించింది.