టీ20 వరల్డ్‌కప్ 2022 ఫైనల్‌లో పాకిస్థాన్ గెలిస్తే, ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పాకిస్థాన్ ప్రధాని అవుతాడని టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నాడు. పాక్ 1992 సెంటిమెంట్ పై స్పందించిన గవాస్కర్ సెటైర్లు పేల్చాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగడం, ఆపై కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్‌కు చేరకుండా వెనుదిరగడం.. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ చేరుకోవడం అభిమానుల్లో ఆశలు రేకెత్తించాయి. సెమీఫైనల్ కోసం టోర్నమెంట్ జట్టు. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు పాక్ అభిమానులు 1992 నాటి సెంటిమెంట్ పునరావృతమవుతుందని, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. గవాస్కర్ ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు తోటి వ్యాఖ్యాతలతో 1992 సెంటిమెంట్ ప్రస్తావించాడు.
— Guess Karo (@KuchNahiUkhada) November 10, 2022
దీని పై గవాస్కర్ స్పందిస్తూ.. ‘‘పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ గెలిస్తే, 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడు’’ అని అన్నారు. ఈ సెంటిమెంట్లు పనికిరావనే ఉద్దేశ్యంతో గవాస్కర్ ఈ సెటైర్లు పేల్చాడు. 1992 ప్రపంచకప్‌లో పాక్ జట్టును టైటిల్ పైకి తెచ్చిన ఇమ్రాన్ ఖాన్.. 2018లో పాక్ ప్రధాని అయ్యాడు.పాకిస్థాన్ టైటిల్ గెలిస్తే 2048లో బాబర్ ప్రధాని అవుతాడని చెప్పాడు. దీని పై గవాస్కర్ స్పందిస్తూ.. ‘‘పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ గెలిస్తే, 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడు’’ అని అన్నారు. ఈ సెంటిమెంట్లు పనికిరావనే ఉద్దేశ్యంతో గవాస్కర్ ఈ సెటైర్లు పేల్చాడు. 1992 ప్రపంచకప్‌లో పాక్ జట్టును టైటిల్ పైకి తెచ్చిన ఇమ్రాన్ ఖాన్.. 2018లో పాక్ ప్రధాని అయ్యాడు.పాకిస్థాన్ టైటిల్ గెలిస్తే 2048లో బాబర్ ప్రధాని అవుతాడని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించే స్థాయి నుంచి పాకిస్థాన్ ఏకంగా ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి.. ఫైనల్‌కు బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగే చివరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.