దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పిస్తోంది. అయితే చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఓ వృద్ధురాలు 105 ఏళ్ల వయసులోనూ తన ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. నరో దేవి అనే 105 ఏళ్ల వృద్ధురాలు ఓటరు చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ 122 లో శనివారం తన ఓటు వేశారు.