ఆస్ట్రేలియాలో విహారయాత్రకు బయలుదేరిన క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం రేపింది. ప్రయాణికుల్లో 800 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వెంటనే ఆ మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకను న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని సిడ్నీ తీరంలో నిలిపేశారు. ప్రయాణికులు అందరినీ అందులోనే క్వారెంటైన్ లో ఉంచారు. బాధితులను నౌకలోనే ఐసోలేషన్ లో ఉంచామని, నౌక వైద్య బృందం వారికి అవసరమైన చికిత్స అందిస్తోందని కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీ తెలిపింది.