నిత్యం రద్దీగా ఉండే యలమంచిలి ఆర్టీసీ బస్సు స్టాండ్ బస్సులు లేక వెలవెల పోయంది. శనివారం విశాఖలో జరుగుతున్న ప్రధాని మోడీ సభకు బస్సులు కేటాయించడంతో చాలా మట్టుకు సర్వీస్ లు రద్దు అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుకు గురయ్యారు. యలమంచిలి నుండి విశాఖపట్నం కి ప్రతి అర గంటకి మెట్రో సర్విస్ లు తెల్లవారుజామున నుండి రాత్రి తొమ్మిది వరకు ఉంటాయి. ఐతే శనివారం వీటిలో చాలా సర్వీస్ లు రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు ప్రవేటు వాహనాలు ఆటోలు పై ఆధార పడడంతో ఇదే అదనుగా ప్రవేట్ వాహనాల ప్రయాణ చార్జీలు అధిక మొత్తంలో ప్రయాణికులు నుండి పిండుకుంటున్నారు.