భారతదేశానికి కీలక నగరం విశాఖపట్నం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. భారతదేశానికి విశేష పట్నం విశాఖపట్నం అని కితాబిచ్చారు. వెయ్యేళ్ల క్రితం నుంచి వ్యాపార రంగానికి కేంద్ర బిందువుగా విశాఖ ఉందన్నారు. రోడ్డు వాయు జల రవాణా కలిగిన ఏకైక నగరం విశాఖ అని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధి తో పాటు ఏపీ అభివృద్ధికి తాను సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. మోదీ హిందీ ప్రసంగానికి ఎమ్మెల్సీ మాధవ్ తెలుగులో అనువాదం చేశారు.