ఏం పిల్లడో ఎళ్దమొస్తవా అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి వంగపండు పాటను ప్రస్తావించారు. దీంతో సభ ప్రాంగణం ఒక్కసారిగా మార్మోగింది. విశాఖలో శనివారం ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ప్రధాని సభ ప్రారంభమైంది. తొలిగా ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. అశేష జనవాహినిని చూస్తుంటే ఉత్తరాంధ్ర ప్రజాగాయకుడు వంగపండు రాసిన పాట గుర్తుకువస్తోందన్నారు. ఏం పిల్లడో ఎళ్దమొస్తవా అన్న రీతిలో ఉత్తరాంధ్ర నుంచి జనం తరలిరావడంపై జగన్ ఉప్పొంగిపోయారు.