విశాఖలో జరిగిన బహిరంగ సభకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్య మంత్రి వైస్ జగన్మోహనరెడ్డి, ఏపీ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రులతో కలసి పలు ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేసారు. ఆ ప్రాజెక్ట్ లలో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ. 152 కోట్లు, 6 లైన్ల రాయపూర్ - విశాఖ ఎకనామిక్ కారిడర్ కు రూ. 3, 778 కోట్లు, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ప్రత్యేక రహదారి కొరకు రూ. 566 కోట్లు, విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ. 460 కోట్లు, శ్రీకాకుళం - అంగుల్ గెయిల్ పైప్ లైన్ రూ. 2, 658 కోట్లు మొత్తం వెరసి మొత్తం రూ. 7, 614 కోట్లు విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు అలాగే ప్రధాని జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులలో, పాతపట్నం - నరసన్నపేట రెండు లైన్ల రహదారికి 211 కోట్లు, ఓ ఎన్ జిసి - యూ ఫీల్డ్ అభివృద్ది ప్రాజెక్టుకు - 2, 917 కోట్లు, మొత్తం 10, 742 కోట్లుతో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా రూపకల్పన చేసారు. ఉత్తఆంధ్ర నుంచి వేలాదిమంది ప్రజలు రాకతో విశాఖ జన సముద్ర మయం అయింది.