ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ నేతలను తక్షణం విడుదల చేయాలని వామపక్ష నేత సిహెచ్ నర్సింగ్ రావు డిమాండ్ చేశారు. కూర్మన్నపాలెం లో శుక్రవారం దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖలోని మీడియాతో మాట్లాడారు. తక్షణం తమ వారిని విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ శాంతియుతంగా విశాఖ ఉక్కు కోసం పోరాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ అరెస్టులకు పాల్పడడం తగదని పేర్కొన్నారు. ఉక్కు ఉద్యోగ కార్మిక నేతలను తక్షణ విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.