పశ్చిమ ఇబ్రహీంపట్నంలో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు ఘనస్వాగతం పలికారు. ఫిబ్రవరి నాటికి ఈ భవన నిర్మాణం పూర్తి చేయనున్నట్టు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందన్నారు.ఎప్పటినుంచో చిరకాల వాంఛ అయిన షాదీఖానా నిర్మాణానికి నిధులు కేటాయించడంతో ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.