ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా మహాసభలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 07:29 PM

పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో శనివారం కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో 6 జిల్లా మహాసభలు ఘనముగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు బి ప్రభాకర్ సభలో ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సమృద్ధిగా తీర ప్రాంతంలో ఉందని విస్తారమైన సంపద ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యంతో ఈ జిల్లా వెనుకబడిందని అన్నారు. అంతేకాకుండా ప్రాంతాలు వారిగా చూస్తే అన్ని ప్రాంతాల్లోని దళితులు నిర్లక్ష్యానికి గురయ్యారని దీనికి కారణం పాలకులని ఆయన గుర్తు చేశారు. దళితుల కోసం అమలవుతున్న 28 పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసిందని , ఈ ప్రభుత్వంలో దళితులపై దాడులు తీవ్రమయ్యావని అన్నారు. ఈ రాష్ట్రములో దళితుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మిస్కా కృష్ణయ్య, కృష్ణ , వెంకటరావు, బాలయ్య, శ్రీరాములు, సుబ్బారాయుడు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa