పంజాబ్ లోని అమృత్‌సర్ లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున 3.42 గంటలకు అమృత్‌సర్ కు పశ్చిమ-వాయువ్యంగా 145 కిలోమీటర్ల దూరంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం యొక్క లోతు భూమికి 120 కిలో మీటర్ల దిగువన ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గత వారం రోజుల్లో ఉత్తర భారత్ లో భూమి కంపించడం ఇది మూడో సారి.