కార్తీక మాసం సందర్భంగా తమిళనాడులోని మహా పుణ్యక్షేత్రం అయినా అరుణాచలం శివాలయం కు హిందూపురం నుంచి ఏడు ప్రత్యేక బస్సులు తరలి తెల్లాయి. ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు హిందూపురం నుంచి బయలుదేరి సోమవారం ఉదయం ఐదు గంటలకు అరుణాచలం చేరుకుంటాయి. అదేవిధంగా సోమవారం రాత్రి 10 గంటలకు అరుణాచలంలో బయలుదేరి మంగళవారం ఉదయం 6 గంటలకు హిందూపురం చేరుకుంటాయని డిపో మేనేజర్ నరేంద్ర రెడ్డి తెలిపారు.