సాధారణంగా పెద్ద కంపెనీల వైన్, షాంపేన్ బాటిళ్లకు ధర ఎక్కువగా ఉంటుంది. కానీ, 'అల్ సాప్స్ ఆర్కిటిక్ అలె' అనే బీరు బాటిల్ ధర 5 లక్షల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 4 కోట్లకు పైనే. దీంతో, ఈ బాటిల్ కు అత్యంత ఖరీదైన బీరు బాటిల్ గా గుర్తింపు వచ్చింది. అల్‌సాప్స్ అనే బీర్ల తయారు కంపెనీ దీన్ని తయారుచేసింది.ఈ బీరు ప్రత్యేకత ఏంటంటే ఈ బీరు బాటిల్ 140 ఏళ్ల నాటిది కాదా, దీనిలో 10 శాతం ఆల్కహాల్ ఉంటుంది.