నేడు భారతదేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'నేడు జయంతి సందర్భంగా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూజీ కి నివాళులు. ఈ సందర్భంగా మన దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుందాం' అని ప్రధాని ట్వీట్ చేశారు. కాగా, నేడు నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa