జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా గుంకలాంలో జగనన్న కాలనీని పవన్ పరిశీలించారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్‌కు జనసేన పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆనందపురం కూడలి వద్ద భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా సింహాచలం భూముల సమస్యను పరిష్కారానికి చొరవ చూపాలంటూ పలువురు నేతలు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. పవన్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు.