గుంటూరు జిల్లాలోని బుడంపాడు వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ పాపతో పాటు ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మంకు చెందిన వీరంతా కారులో అరుణాచలం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారు జామున కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్న లారీను ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa