అయోధ్యలో మసీదు నిర్మాణం 2023 డిసెంబర్ కల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 ఎకరాల భూమిలో నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తెలిపింది. ఈ నెలాఖరులోగా మసీదు, గ్రంథాలయం, పరిశోధన కేంద్రానికి సంబంధించి ప్రణాళికలకు అయోధ్య ప్రాధికార సంస్థ నుంచి అనుమతులు లభిస్తాయని ఆశిస్తున్నట్లు ట్రస్టు కార్యదర్శి అతార్ హుస్సేన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa