ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు అందింది. జనసేన నాయకుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు తోట త్రిమూర్తులుపై ఫిర్యాదు చేశారు.ప్రభుత్వానికి చెందిన 35 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని... అందులో చేపల చెరువులు ఏర్పాటు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa