అత్యాధునిక వసతులతో కూడిన వందేభారత్ రైలు విశాఖ నుంచి 2 నెలల్లో ప్రారంభం కానున్నట్లు వాల్తేరు డీఆర్ఎం అనూప్ సత్పతి తెలిపారు. ప్రస్తుత ట్రాక్ సామర్థ్యం వందే భారత్ రైలు వేగానికి సరిపోతుందని తెలిపారు. ఒకసారి ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తామన్నారు. ఈ రైలు ఏ మార్గంలో ప్రయాణిస్తుందనే దానిపై స్పష్టత లేదు. అయితే తిరుపతి లేదా విజయవాడకు ఉండే అవకాశం ఉంది.