దేశంలో రెండున్నరేళ్ల తర్వాత అతి తక్కువగా కోవిడ్ యాక్టివ్, రోజువారీ కేసులు సోమవారం నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 547 మంది వైరస్ బారిన పడగా కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,468కు తగ్గింది. 2020 ఏప్రిల్ తర్వాత ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కేసులు తగ్గుతున్నా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు.