రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒకటి, రెండు నెలల్లోనే అందుబాటులోకి వస్తుంది. ఏపీకి కేటాయిస్తామని మంత్రి చెప్పిన రైలు విశాఖపట్నానికే వస్తుంది. ఇక్కడి నుంచి విజయవాడ/తిరుపతి నగరాల వరకూ నడుస్తుంది’’ అని వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ అనూ్‌పకుమార్ శెత్పథి వెల్లడించారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన నూతన రైల్వేజోన్ ‘దక్షిణ కోస్తా’ కార్యాలయం పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తాం. ఇందుకోసం డీఆర్‌ఎం కార్యాలయానికి వంద మీటర్ల దూరానున్న వైర్‌లెస్ కాలనీలో 13 ఎకరాల స్థలాన్ని మంత్రి అశ్వినీ కూడా పరిశీలించారు. అక్కడే కొత్త రైల్వే జోన్ కార్యాలయం వస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అధునాతన సదుపాయాలతో బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తాం. దీనికి ఇప్పటికే రూ.106 కోట్లు మంజూరయ్యాయి. భవనం డిజైన్లు రైల్వే బోర్డుకు సమర్పించాం. అవి ఖరారుకాగానే టెండర్లు పిలుస్తాం. విశాఖపట్నం రైల్వేస్టేషన్ పునర్మిర్మాణ పనులకు టెండర్లు ఖరారు చేశాం. ఈ పనులను మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని తెలిపారు. ఓఎ్‌సడీ చంద్రశేఖర్ మాట్లాడుతూ... కొత్త జోన్ పనులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కచ్చితంగా ప్రారంభమవుతాయని, డీపీఆర్‌కు కూడా ఆమోదం లభిస్తుందని తెలిపారు.