అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం శబరిమలకు ప్రత్యేక రైళ్లను వేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నాందేడ్-కొల్లాం మధ్య ఈనెల 17, 24 తేదీల్లో ప్రత్యేక రైలు (నెం.07129) ఉంటుందన్నారు. ఆయా తేదీల్లో నాందేడ్ నుంచి రాత్రి 11.45 గంటలకు బయలుదేరి రెండు రోజుల తర్వాత కొల్లాం చేరుకుంటుందన్నారు. ఈ రైలు ముడ్‌ఖేడ్, ఉమ్రి, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, అకనపేట్, మేడ్చల్, సికింద్రాబాద్, బేగంపేట, వికారాబాద్, తాండూరు, సేరం, సునేహళ్లి, యాద్గిర్, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, రాంజంపేట, కోడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలారపట్టై, సేలం, ఈరోడ్డు, తిరుపూర్, కోయంబత్తూరు, పాల్ఘాట్, త్రిసుర్, అలువ, ఎర్నాకులం టౌన, కొట్టాయం, తిరువళ్ల, చెంగనూరు, మెవెలికెర, కల్యానకులం, సస్తనకోట స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు. అలాగే కొల్లాం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెం. 07130) కొల్లాంలో ఈ నెల 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి 12-30 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు సస్తనకోట నుంచి లింగంపల్లి స్టేషన వరకూ నాందేడ్ ప్రత్యేక రైలు నిలిచే స్టేషన్లన్నింటిలోనూ ఆగుతుందన్నారు.