అక్వాకు సంబంధించిన అన్ని ఫ్యాక్టరీలను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని పెత్తనం చెలాయిస్తోందని మాగంటి బాబు విమర్శించారు. దీనివల్ల అక్వా రైతులు భయపడిపోతున్నారన్నారు. జడ్పీటీసీ ఓడిపోయానని తనను వైయస్ రాజశేఖర రెడ్డి పదవి నుంచి తప్పించారని.. ఆ కొద్దిరోజులకే ఆయన ఈ లోకంలో లేకుండా పోయారన్నారు. ‘నేను మంచివాడనే.. కానీ నేను మనిషినే’ అంటూ మాగంటి బాబు వ్యాఖ్యానించారు.