ఐపీఎల్‌కు ప్రముఖ క్రికెటర్ కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్ కోచ్‌గా, ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టులో ఆటగాడిగా కనిపిస్తానని చెప్పాడు. 13 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే 2023 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలం జరగనుంది. పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్ వదులుకునేందుకు సిద్ధపడింది. ఈలోపే పొలార్డ్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు.