టిడ్కో ఇల్లు రాని వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పేదలతో పాటు ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హామీ ఇచ్చారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో కలసి టిడ్కో 64మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఎమ్మెల్సీ హనుమంతరావు సూచనలతో టిడ్కో ఇంటి కోసం డీడీల ద్వారా నగదు చెల్లించినప్పటికీ ఇళ్లు రానివారికి తిరిగి నగదు చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి, ఇతర అధికారులు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.