నలుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్షను రద్దు చేస్తూ కోల్‌కత్తా హైకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు పాకిస్థానీయులతో సహా నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను నిర్ధోషులుగా ప్రకటించింది. షేక్ నయీమ్, షేక్ అబ్దుల్లా, మహ్మద్ యూనస్, అహ్మద్ రాథర్‌లను నిర్ధోషులుగా నిర్థారిస్తూ తీర్పు చెప్పింది. వీరంతా 2007లో ఇండియాలో యుద్ధానికి కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో 10 ఏళ్లు జైలు శిక్షను అనుభవించారు.