బాపట్ల జిల్లాలో ప్రేమికులు ఆత్మహత్య కలకలం రేపింది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం గరటయ్య కాలనీ సమీపంలోని కాకాని కుంట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు అద్దంకి పట్టణానికి చెందిన పెద్దిరాజు (22), ప్రశాంతి (20) గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.