రావికమతం మండలం దొండపూడిలో వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు మేజర్లు కలిపి ఆమెను అత్యాచారం చేసి కోరిక తీర్చుకున్నారు. బాదితురాలు కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటన వెలుగు చూసింది. కొత్తకోట ఎస్సై విభీషణరావు, బాదితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాలు మేరకు. దొండపూడి ఎస్సీ కాలనీలో భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటోన్న 33 ఏళ్ల వివాహితను అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్, టెన్త్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు మేజర్లు, ఇద్దరు మైనర్లు కలిపి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ నెల 6న ఆమె దొండపూడి గ్రామ శివార్లలో జీడి మామిడి తోటల్లోకి కట్టెల కోసం వెళ్లగా అదే సమయంలో ఆ ప్రదేశంలో సంచరిస్తున్న ఇద్దరు మైనర్లు సహా నలుగురు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో బాధితురాలు ఆమె భర్తతో కలిసి ఆదివారం రాత్రి కొత్తకోట పోలీస్ స్టేషన్కు వచ్చి తనపై జరిగిన అత్యాచారంపై ఫిర్యాదు చేసినట్టు ఎస్సై విభీషణరావు తెలిపారు. వెంటనేకొత్తకోట పోలీసులు ఈసంఘటనను ఉన్నతదికారులకు తెలియజేయడంతో ఎస్ పి ఆదేశాలు మేరకు అనకాపల్లి దిశా డి ఎస్ పి. మళ్లమహేశ్వరరావు, సీఐ టి. లక్ష్మి, ఎస్ ఐ. శేఖరం సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నలుగురిపై రేప్ కేసు నమోదు చేశారు. నిందితులను కోర్ట్ కు తరలించారు. వివాహతపై అత్యాచారంకు పాల్పడ్డ ఇద్దరు మేజర్లు, ఇద్దరు మైనర్లపై రేప్ కేసు నమోదు చేసినట్లు కొత్తకోట ఎస్ ఐ. విబిషణరావు తెలిపారు. బాధితురాలను వైద్య పరీక్షల నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.