చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గతరాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం ఇళ్ల లోంచి బయటకు పరుగులు తీశారు. పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి.15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ సారి ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదు.