ఏపీలో కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లకు ఏపీఎస్బీసీఎల్ అనుమతులు మంజూరు చేసింది. అదే కేటగిరీలోని మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు వీటికి అనుమతి ఇవ్వడం గమనార్హం. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని కంపెనీలకు చెందిన ఈ బ్రాండ్లకు అనుమతి మంజూరు చేసింది. కొత్త బ్రాండ్లు, వాటి ధరల విషయంలో ఏపీఎస్బీసీఎల్ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.