అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. "అమెరికాను మళ్లీ గొప్పగా, అద్భుతంగా మార్చడానికి నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నాను" అని ఆయన చెప్పారు. 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికలో ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనంతరం 2020 ఎన్నికల్లో ఓడిపోయారు.