భారత్ లో తయారైన దగ్గుమందుతో ఇటీవల ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసి భారీ స్థాయిలో పంపిణీ చేయడం గొప్ప విజయంగా అభివర్ణించారు. అయినా భారత్ శాస్త్ర పరిశోధనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటోందని పేర్కొన్నారు. ‘ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్’ బహుమతి ప్రధానోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.