డబ్బు సంపాదన కోస పథకం ప్రకారమే డీఎంకే ప్రభుత్వం వర్షపు నీటి కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తోందని సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. డీఎంకే వారికి డబ్బులు మాత్రమే కావాలని అంతకు ముందే సీఎం ఇంటికి సూట్ కేసుల్లో డబ్బు వెళ్తోందని ఆరోపించారు. వర్షాలకు ముందే కాలువల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తనపై కేసు నమోదు చేసినా పర్వాలేదని ఆమె వ్యాఖ్యానించారు.