వైద్య, ఆరోగ్యశాఖలో నియామకాల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య నియామకాల కోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఏపీ ఎంఎస్ఆర్బీ) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బోర్డులో చైర్మన్ గా వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి, మెంబర్ సెక్రటరీగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి, సభ్యుడిగా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఉంటారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.