గుర్ గ్రామ్ లో పెంపుడు కుక్క దాడి ఘటనలో బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ ను జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అంతే కాకుండా కుక్కను కస్టడీలోకి తీసుకోవాలని, లైసెన్స్ రద్దు చేయాలని ఉత్తర్వులిచ్చింది. 11 రకాల విదేశీ కుక్కల జాతులను నిషేధించాలని, పెంపుడు కుక్కల కోసం 3 నెలల్లో పాలసీ రూపొందించాలని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్ 11న మున్నీ అనే మహిళపై పెంపుడు కుక్క దాడి చేసింది.