బాపట్ల: అద్దంకికి చెందిన బత్తుల పెద్దిరాజు, పల్లపోగు ప్రశాంతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు వారాల క్రితం ప్రశాంతి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు శింగరకొండ వద్ద ప్రశాంతిని గుర్తించి బంధువులకు అప్పగించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇద్దరూ బయటికి వచ్చి అదృశ్యమయ్యారు. తెల్లవారిన తర్వాత కాకానికుంట వద్ద చింతచెట్టుకు వీరిద్దరూ ఉరివేసుకొని కనిపించారు.