పులివెందుల పట్టణంలోని పలు వార్డు పర్యటనలో బాగంగా మునిసిపల్ ఇంచార్జి వైయస్ మనోహర రెడ్డి , మునిసిపల్ చైర్మన్ వి వర ప్రసాద్, మునిసిపల్ వైస్ చైర్మన్ ఎస్ హాపీ జుళ్లా, మునిసిపల్ కమిషనర్ వి వి నరసింహ రెడ్డి తో కలిసి బుధవారం పురపాలక సంఘం పరిధి లోని బొగ్గుడు పల్లి నందు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బొగ్గుడుపల్లి నందు అవసరమయిన ప్రతిచోటా వీధి లైట్లు మరియు సిమెంటు రోడ్లు, నీటి సరఫరా పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతర బాకారాపురం నందలి బాలికల హాస్టల్ వద్ద గల రోడ్డు ను పరిశీలించి అక్కడి రోడ్ కు మరమ్మత్తులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డి ఈ గుర్రప్ప యాదవ్, టౌన్ ప్లానింగ్ అధికారి అజయ్ కుమార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.