జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా బుధవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నియోజకవర్గ పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి, చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరే పాత్రికేయుల కృషి గణనీయమైనదని, పాత్రికేయుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.