18 ఏళ్ల వయసు నిండిన భారత పౌరులెవరైనా పీపీఎఫ్ ఖాతా తీసి పెట్టుబడి పెట్టొచ్చు. పీపీఎఫ్ అకౌంట్ తీయడానికి గరిష్ఠ వయోపరిమితి లేదు. ఒకరు ఒక అకౌంట్ మాత్రమే తీయొచ్చు. జాయింట్ అకౌంట్ సౌకర్యం లేదు. ఎన్ఆర్ఐలు, హెచ్ యూఎఫ్ లు పీపీఎఫ్ అకౌంట్ ను తెరిచేందుకు అర్హులు కారు. ఒకవేళ వారి పేరుపై ఇప్పటికే ఖాతా ఉంటే 15 ఏళ్ల కాలవ్యవధి పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఇక పీపీఎఫ్ ఖాతాదారులకు నామినీ సౌకర్యం ఉంటుంది.