భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల లో సచివాలయం ఏర్పాటు చేయాలని ముచ్చర్ల గ్రామస్తులు బుధవారం మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.సచివాలయాన్ని ముచ్చర్లకు దూరంలో ఉన్న కణమాం గ్రామానికి మార్చడంపై నిరసన తెలియజేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అనందపురం మండలంలో 26 పంచాయతీలు గాను 18 సచివాలయాలు ఏర్పాటు చేసారు. అందులో ముచ్చర్ల సచివాలయం ఒకటి. రికార్డులలో ముచ్చర్ల సచివాలయం ఉన్న అధికారులు మాత్రం కనమాం సచివాలయం కింద ముచ్చర్ల గ్రామపంచాయతీని చేర్చడంతో వివాదం తలెత్తింది.
ముచ్చర్ల నుండి సుమారు 8 కి. మీ దూరంలో ఉన్న కణమాం సచివాలయానికి మార్చడం ఏమిటని అప్పట్లో మూడేళ్ల క్రితం శాసనసభ్యులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సచివాలయం కనమాం గ్రామ పంచాయతీలో పక్కా భవనాలు ఏర్పాటు చేసి ముచ్చర్లని కనమాం పంచాయతీకి అనుసంధానం చేయడానికి చాప కింద నీరులా పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సచివాలయాన్ని తరలించవద్దంటూ ప్లేకార్డులతో నిరసన తెలియజేశారు. అనంతరం ఎంపీడీవో అందుబాటు లేకపోవడంతో ఈఓఆర్డి ఆంజనేయులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం స్థానికంగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ షినగం ఎర్రయ్య, మాజీ సర్పంచ్ లంకప్పల నారాయణ లంక రమణ, మాజీ ఎంపీటీసీలు పాండ్రంకి గంగరాజు , సినగం శివ , గుషి డి ముత్యాలు, జనసేన నాయకులు శినగం బంగారు నాయుడు, గ్రామ యువకులు లెంక శివాజీ, గంగునాయుడు, పాం డ్రంకి శివసత్యం తదితరులు పాల్గొన్నారు.