విశాఖపట్నంలో ఆర్. కె. బీచ్ వద్ద మూడురోజులపాటు జరగనున్న గిరిజన గౌరవ ఉత్సవాలను మంగళవారం ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన జీవవ విధానం ఎంతో ఆసక్తికరమన్నారు. ఇటువంటి ఉత్సవాలతో వారి జీవన వైవిధ్యం అందరికీ తెలిసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి , జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర , పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే పాల్గుణ, , పాలకొండ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు.