యూపీలో మద్యానికి బానిసైన శైలేంద్ర కుమార్ మత్తులో మంగళవారం రాత్రి భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. 18ఏళ్ల కూతురు షాలిని గొడవను ఆపి తన తల్లిని రక్షించేందుకు ప్రయత్నించింది. దీంతో తండ్రి పిస్టల్‌తో కూతురిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఛాతీకి తగిలి షాలిని అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడు పరారు కాగా పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.