రెవెన్యూ అధికారులు తమ తీరును మార్చుకోవాలని , అవినీతికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించక తప్పదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. వెదురుకుప్పం మండలం , ఆళ్ళమడుగు సచివాలయం పరిధిలోని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతున్న అధికారులు క్యాన్సర్ తో పోరాడుతున్న రోగుల లాంటి వారని, తీరును తప్పనిసరిగా మార్చుకోవాలన్నారు. పెనుమూరు మండలంలో జరిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ, ప్రజాసేవ కోసమే అధికారులు ఉన్నారని అటువంటివారు ఇలా అవినీతికి పాల్పడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు అధికారులు తమ తీరును మార్చుకోవాలి అన్నారు.