ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హర్దోయ్ లోని ఓ మూసి ఉన్న గోడౌన్ లో ఈ ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక యంత్రాల సంఘటన స్థలానికి వచ్చి, మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ భారీగా ఆస్తినష్టం జరిగిందని అధికారులు తెలిపారు.