తెలంగాణ ఉన్నత విద్యామండలి నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఓ పోర్టల్ ను రూపొందించింది. ఈ పోర్టల్ కు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(SAVS) అనే పేరు పెట్టారు. ఈ పోర్టల్ ను రేపు (నవంబర్ 18) ప్రారంభించనున్నారు. దీనిలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నుంచి గత 12ఏళ్లలో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల డేటా ఉంటుంది. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే సర్టిఫికెట్ అసలుదో, నకిలీదో తెలుస్తుంది.