ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణుకుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మంగళవారం 13 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు బుధవారం ఒక్కసారిగా పడిపోవడంతో జనం చలితో గజగజలాడుతున్నారు. ఇక, పాడేరు మండలంలోని మినుములూరు కాఫీ బోర్డులో 10.1, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచుతో మన్యం తడిచి ముద్దవుతోంది.