దివ్యాంగ పెన్షన్లను పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల తనిఖీ బాధ్యతలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వివిధ పెన్షన్ల జాబితాను వడబోసింది. ప్రస్తుతం ఏపీలో 6.5 లక్షలుగా పైగా దివ్యాంగ పెన్షన్లను అందిస్తున్నారు. అయితే దివ్యాంగ పెన్షన్లు అర్హులకే అందుతున్నాయా? లేదా? అనేది అధికారులు ఆరా తీయనున్నారు.